Saturday, June 27, 2026
HomeENTERTAINMENTPeddi-Box-Office | రామ్‌చరణ్ ‘పెద్ది’ బాక్సాఫీస్ సునామీ.. రూ. 500 కోట్ల దిశగా అడుగులు

Peddi-Box-Office | రామ్‌చరణ్ ‘పెద్ది’ బాక్సాఫీస్ సునామీ.. రూ. 500 కోట్ల దిశగా అడుగులు

-

Peddi-Box-Office: బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందిన స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ ప్రధాన పాత్రతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. విడుదలైన మొదటి రోజు నుంచే అద్భుతమైన వసూళ్లతో దూసుకుపోతున్న ఈ చిత్రం, ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లలో కొత్త రికార్డులను నెలకొల్పుతోంది. నిర్మాణ సంస్థ వృద్ధి సినిమాస్ వెల్లడించిన వివరాల ప్రకారం, ‘పెద్ది’ సినిమా తొలి వీకెండ్‌లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 292.5 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది.

మొదటి రోజే రూ. 135.36 కోట్ల భారీ ఓపెనింగ్స్‌తో ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసిన ఈ చిత్రం, ఆ తర్వాత కూడా అదే జోరును కొనసాగించింది. రెండో రోజు రూ. 46.44 కోట్లు, మూడో రోజు రూ. 54.90 కోట్లు వసూలు చేసిన ‘పెద్ది’, ఆదివారం కలెక్షన్లతో కలిపి నాలుగు రోజుల్లోనే భారీ మైలురాయిని అందుకుంది. “బాక్సాఫీస్ ఛాంపియన్ ‘పెద్ది’ సరికొత్త రికార్డు సృష్టించింది” అని చిత్ర బృందం సోషల్ మీడియాలో ప్రకటించింది.

ఫస్ట్ వీకెండ్‌లో భారీ వసూళ్లు సాధించినప్పటికీ, సినిమా అసలు పరీక్ష వర్కింగ్ డేస్‌లో ప్రారంభం కానుంది. వీక్‌డేస్‌లో కూడా ఇదే స్థాయి హవా కొనసాగిస్తే, రెండో వారాంతానికి ‘పెద్ది’ సులభంగా రూ. 500 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశముందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

- Advertisment -
Chat on WhatsApp

Must Read

andhra pradesh heavy rain alert yellow warning for coastal districts

Heavy rains | ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజుల పాటు వర్షాలు.. వాతావరణ శాఖ కీలక...

Heavy rains: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి వర్షాలు విస్తరించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వాతావరణంలో ఏర్పడిన తాజా మార్పుల కారణంగా రానున్న రెండు నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే...
- Advertisement -
Chat on WhatsApp