Saturday, June 27, 2026
HomeNationalWest Bengal election results | మమతాకు బిగ్ షాక్.. బెంగాల్‌లో బీజేపీ సునామీ!

West Bengal election results | మమతాకు బిగ్ షాక్.. బెంగాల్‌లో బీజేపీ సునామీ!

-

West Bengal election results: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నాయి. టీఎంసీ, బీజేపీ మధ్య పోటీ క్షణక్షణానికి మారుతున్నప్పటికీ, తాజా ట్రెండ్స్‌లో బీజేపీ ఆధిక్యం స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తం 294 స్థానాలకు గానూ 293 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతుండగా, బీజేపీ అభ్యర్థులు ఎక్కువ స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నారు.

ఎర్లీ ట్రెండ్స్ ప్రకారం బీజేపీ సుమారు 172 స్థానాల్లో లీడింగ్‌లో ఉండగా, టీఎంసీ 113 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 2 స్థానాల్లో, లెఫ్ట్ పార్టీలు 5 చోట్ల, ఇతరులు కొన్ని స్థానాల్లో ముందంజలో ఉన్నారు. ఈ ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులకు దారితీసే సూచనలు ఇస్తున్నాయి.

ప్రత్యేకంగా భవానీపూర్ వంటి ప్రతిష్టాత్మక నియోజకవర్గంలో టీఎంసీ అధినేత మమతా బెనర్జీ, బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి మధ్య పోటీ హోరాహోరీగా సాగుతోంది. ఎర్లీ ట్రెండ్స్ ప్రకారం ఈ స్థానంలో సువేందు ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే నందిగ్రామ్‌లో కూడా ఆయన లీడింగ్‌లో కొనసాగుతున్నారు.

మొత్తం మీద బెంగాల్‌లో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ దాటే దిశగా ముందుకు సాగుతుండగా, తుది ఫలితాలు ఎలా ఉండబోతాయన్నది ఆసక్తిగా మారింది. రాష్ట్ర రాజకీయాల్లో ఈ ఎన్నికలు కీలక మలుపు తిప్పే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.

- Advertisment -
Chat on WhatsApp

Must Read

andhra pradesh heavy rain alert yellow warning for coastal districts

Heavy rains | ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజుల పాటు వర్షాలు.. వాతావరణ శాఖ కీలక...

Heavy rains: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి వర్షాలు విస్తరించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వాతావరణంలో ఏర్పడిన తాజా మార్పుల కారణంగా రానున్న రెండు నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే...
- Advertisement -
Chat on WhatsApp