విజయవాడ నుంచి హైదరాబాద్(Vijayawada–Hyderabad) మధ్య ప్రయాణికులకు శుభవార్త. ఫ్లై91 విమానయాన సంస్థ కొత్తగా ప్రారంభించిన విమాన సర్వీస్‌తో ఈ రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది.
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు రోజువారీ విమాన సర్వీస్‌ను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వర్చువల్‌గా ప్రారంభించారు.
ఈ సర్వీస్ ప్రకారం విజయవాడ నుంచి ఉదయం 7.30 గంటలకు విమానం బయలుదేరి 8.40 గంటలకు హైదరాబాద్‌కు చేరుకుంటుంది. అలాగే ఏప్రిల్ 17 నుంచి మరో సర్వీస్ కూడా అందుబాటులోకి రానుంది. అది ఉదయం 10.30కి విజయవాడలో బయలుదేరి 11.40కి హైదరాబాద్‌కు చేరుకుంటుంది.
విజయవాడతో పాటు రాజమండ్రి విమానాశ్రయం నుంచి కూడా హైదరాబాద్‌కు కొత్త సర్వీసులు ప్రారంభించబడుతున్నాయి. ఈ సర్వీసులు వ్యాపారులు, ఉద్యోగులు, విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా ఉండనున్నాయి. విజయవాడ–హైదరాబాద్ మధ్య రద్దీ ఎక్కువగా ఉండటంతో ఈ కొత్త ఫ్లైట్ సర్వీస్ పెద్ద ఊరటగా మారనుంది.
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, రాష్ట్రంలోని విమానాశ్రయాల అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. విజయవాడ, రాజమహేంద్రవరం, కడప విమానాశ్రయాల అభివృద్ధి కొనసాగుతోందని చెప్పారు.
అలాగే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ పనులు జూన్ నాటికి పూర్తిచేసి జూలైలో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
భవిష్యత్తులో విజయవాడ నుంచి దుబాయ్, కువైట్, కొచ్చి, వారణాసి వంటి అంతర్జాతీయ, దేశీయ సర్వీసులు కూడా ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం. జజీరా ఎయిర్‌వేస్ కువైట్ సర్వీస్ కోసం డీజీసీఏకు ద







