Saturday, June 27, 2026
HomeNationalDitva Cyclone: తమిళనాడులో రెడ్ అలర్ట్, పాఠశాలలకు సెలవులు 

Ditva Cyclone: తమిళనాడులో రెడ్ అలర్ట్, పాఠశాలలకు సెలవులు 

-

Tamil Nadu Weather: బంగాళాఖాతంలో తీవ్రరూపం దాల్చిన ‘దిత్వా’ తుపాను(ditva cyclone) వాయవ్య దిశగా గంటకు సుమారు 7 కి.మీ. వేగంతో కదులుతూ, ఉత్తర తమిళనాడు–పుదుచ్చేరి తీరాన్ని(Puducherry coast) చేరుకుంది.

రేపు ఉదయం తీరం దాటే అవకాశం ఉండటంతో తమిళనాడు ప్రభుత్వం ముందస్తు చర్యలను చేపట్టింది. కడలూరు, విల్లుపురం, చెంగల్పట్టు జిల్లాలు మరియు పుదుచ్చేరికి రెడ్ అలర్ట్ జారీ చేశారు.

ALSO READ:Gas delivery boy ganja case | గ్యాస్‌ డెలివరీ బాయ్‌ నుంచి గంజాయి డెలివరీ బాయ్ 

సముద్రంలో  అలజడి ఎక్కువ అవడంతో  మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేసారు.

తుపాను ప్రభావంతో తమిళనాడులో పలు విమానసేవలు రద్దయ్యాయి. చెన్నైలోని పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు. ఇక ఆంధ్రప్రదేశ్‌పై కూడా దిత్వా ప్రభావం తీవ్రంగా కనిపించనుంది.

రాబోయే 48 గంటల్లో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో 20 సెం.మీ. వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు.

- Advertisment -
Chat on WhatsApp

Must Read

andhra pradesh heavy rain alert yellow warning for coastal districts

Heavy rains | ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజుల పాటు వర్షాలు.. వాతావరణ శాఖ కీలక...

Heavy rains: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి వర్షాలు విస్తరించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వాతావరణంలో ఏర్పడిన తాజా మార్పుల కారణంగా రానున్న రెండు నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే...
- Advertisement -
Chat on WhatsApp