Ram Charan Peddi: బాబాయ్ కోసం వెనక్కి తగ్గిన అబ్బాయ్.. ‘పెద్ది’(Peddi) అఫీషియల్ రిలీజ్ డేట్ ప్రకటించేసారు! మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘పెద్ది’ సినిమా కోసం ఫ్యాన్స్ లో ఉత్కంఠ చివరకు పూర్తైంది. దర్శకుడు బుచ్చిబాబు సానా అధికారికంగా ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల జరగబోతున్నట్లు ప్రకటించారు.
ముందుగా మర్చ్ 27న రిలీజ్ చేయాలని యోచించినప్పటికీ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మర్చ్ 26న విడుదల కావడం నేపథ్యంలో వారం రోజుల తేడాతో ‘పెద్ది’ రిలీజ్ డేట్ నిర్ణయించబడింది. ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఉస్తాద్ భగత్ సింగ్, పెద్ది, పవన్, రామ్ చరణ్ అనే హ్యాష్‌ట్యాగ్స్‌తో ట్రెండ్ అవుతున్నారు.
‘పెద్ది’ సినిమా భారీ బడ్జెట్, ఎమోషనల్ కథ, గ్రాండ్ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌లతో సమ్మర్ సెలవులు అడ్వాంటేజ్ గా మారనుంది. కుటుంబ ప్రేక్షకులతో పాటు యూత్‌ను ఆకట్టుకునేలా, గ్రాండ్ స్కేల్‌లో షూట్ పూర్తి అయింది. ప్రస్తుతం షూటింగ్, ప్రొడక్షన్ పూర్తి అయిన ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ కావడంతో hype మరింత పెరిగింది. ఏప్రిల్ 30 న ‘పెద్ది’ ఎలా అలరిస్తుందో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.







