Raghav Chadha: ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీ నేత రాఘవ్ చద్దా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఆప్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరినట్లు అధికారికంగా ప్రకటించారు. సొంత పార్టీలో తనకు మాట్లాడే స్వేచ్ఛ లేకుండా చేశారని ఆయన తీవ్ర విమర్శలు చేశారు.
రాఘవ్ చద్దాతో పాటు మరో ఇద్దరు ఎంపీలు సందీప్ పఠాక్, అశోక్ మిట్టల్ కూడా బీజేపీలో చేరినట్లు సమాచారం. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఆప్‌లో అంతర్గత పరిస్థితులు సరిగా లేవని, తన అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి అవకాశం ఇవ్వలేదని రాఘవ్ చద్దా ఆరోపించారు. ఈ కారణంగానే పార్టీని వీడాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు.
ఇక ఈ పరిణామం రాబోయే ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆప్ నుంచి కీలక నేతలు వరుసగా బయటకు రావడం పార్టీకి పెద్ద దెబ్బగా మారే అవకాశం ఉందని అంటున్నారు.







