Saturday, June 27, 2026
HomeNationalమీ దగ్గర చిల్లిగవ్వ లేదా అయితే ఇది చదవండి....తాకట్టు లేకుండా రూ.5 లక్షల లోన్

మీ దగ్గర చిల్లిగవ్వ లేదా అయితే ఇది చదవండి….తాకట్టు లేకుండా రూ.5 లక్షల లోన్

-

PhonePe Personal Loan: ఈ మధ్య కాలంలో అత్యవసరంగా డబ్బు కావాలంటే బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన రోజులు పోయాయి. మనం రోజూ ఉపయోగించే ఫోన్‌పే యాప్ ఇప్పుడు అవసరమైన వారికీ వ్యక్తిగత లోన్స్ అందించడంలోనూ ముందుంది.

ఎలాంటి తాకట్టు లేకుండా, కేవలం మొబైల్ ద్వారానే రూ.10,000 నుంచి గరిష్టంగా రూ.5 లక్షల వరకు లోన్ పొందే అవకాశం ఉంది.

ఫోన్‌పే(PhonePe) వివిధ బ్యాంకులు, NBFCలతో భాగస్వామ్యం చేసుకుని ఈ లోన్ సేవలను అందిస్తోంది. ఇవి అన్‌సెక్యూర్డ్ లోన్స్ కావడంతో బంగారం లేదా ఆస్తిని తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు.

మీ క్రెడిట్ ప్రొఫైల్ ఆధారంగా లోన్ అర్హత నిర్ణయిస్తారు. దరఖాస్తు ఆమోదం పొందిన 72 గంటల్లోపు లోన్ మొత్తం నేరుగా మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది.

లోన్ తిరిగి చెల్లించడానికి 12 నెలల నుంచి 60 నెలల వరకు కాలపరిమితి ఉంటుంది. వడ్డీ రేట్లు ఏటా సుమారు 11.30 శాతం నుంచి 35 శాతం వరకు ఉండొచ్చు. 21 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు కలిగి, కనీసం నెలకు రూ.15,000 ఆదాయం ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు.

సిబిల్ స్కోర్ 650కు పైగా ఉంటే లోన్ వచ్చే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి.

ఈ మొత్తం ప్రక్రియ డిజిటల్ పద్ధతిలోనే జరుగుతుంది. ఆధార్, పాన్ కార్డు, 6 నెలల బ్యాంక్ స్టేట్‌మెంట్, శాలరీ స్లిప్స్ ఉంటే సరిపోతుంది.

ఫోన్‌పే యాప్‌లో Loans విభాగంలోకి వెళ్లి వివరాలు నమోదు చేసి, లోన్ మొత్తం మరియు కాలపరిమితిని ఎంచుకుంటే సరిపోతుంది. ప్రాసెసింగ్ ఫీజు, EMI వివరాలు ముందే స్పష్టంగా చూపిస్తారు. సకాలంలో EMIలు చెల్లిస్తే క్రెడిట్ స్కోర్ కూడా మెరుగుపడుతుంది.

- Advertisment -
Chat on WhatsApp

Must Read

andhra pradesh heavy rain alert yellow warning for coastal districts

Heavy rains | ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజుల పాటు వర్షాలు.. వాతావరణ శాఖ కీలక...

Heavy rains: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి వర్షాలు విస్తరించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వాతావరణంలో ఏర్పడిన తాజా మార్పుల కారణంగా రానున్న రెండు నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే...
- Advertisement -
Chat on WhatsApp