Saturday, June 27, 2026
HomeNationalPetrol and diesel prices | వాహనదారులకు ఊహించని షాక్... దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్

Petrol and diesel prices | వాహనదారులకు ఊహించని షాక్… దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్

-

Petrol and diesel prices: దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగి వాహనదారులను మరోసారి షాక్ కు గురిచేసింది. అందిన సమాచారం ప్రకారం పెట్రోల్‌పై 87 పైసలు, డీజిల్‌పై 91 పైసలు పెంచినట్లు తెలుస్తుంది. పెంచిన కొత్త ధరలు ఈరోజు నుంచే అమల్లోకి వచ్చాయి.

ఇది కేవలం రెండు వారాల వ్యవధిలో మూడోసారి ధరల పెంపు కావడం గమనార్హం. వరుసగా ఇంధన ధరలు పెరుగుతుండటంతో వాహనదారులు, రవాణా రంగం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పెరుగుదల లాజిస్టిక్స్ ఖర్చులపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరగడం ఈ పరిస్థితికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో చమురు ధరలు 40 శాతానికి పైగా పెరిగినట్లు సమాచారం. దీంతో అంతర్జాతీయంగా ఇంధన సరఫరా వ్యవస్థపై ఒత్తిడి పెరిగింది.

ఈ ప్రభావం భారత మార్కెట్‌పైనా పడుతోంది. దీంతో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా మూడోసారి పెరిగినట్లు తెలుస్తోంది.

తాజా పెంపుతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.112.71కి చేరనుండగా, డీజిల్ ధర రూ.100.86కి పెరగనుంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.98.64కి చేరుకోనుండగా, డీజిల్ ధర రూ.91.58గా ఉండనుంది.

వరుస ధరల పెంపుతో సాధారణ ప్రజలపై అదనపు భారం పడుతుందని, రవాణా ఖర్చులు పెరగడంతో నిత్యావసర వస్తువుల ధరలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

https://youtu.be/RHGbPRiK6Pc
- Advertisment -
Chat on WhatsApp

Must Read

andhra pradesh heavy rain alert yellow warning for coastal districts

Heavy rains | ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజుల పాటు వర్షాలు.. వాతావరణ శాఖ కీలక...

Heavy rains: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి వర్షాలు విస్తరించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వాతావరణంలో ఏర్పడిన తాజా మార్పుల కారణంగా రానున్న రెండు నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే...
- Advertisement -
Chat on WhatsApp