Saturday, June 27, 2026
HomeTechnology NewsOppo Pad 6 విడుదల... ధరలు, ఫీచర్లు ఇవే.. కొత్త టాబ్లెట్ పూర్తి వివరాలు

Oppo Pad 6 విడుదల… ధరలు, ఫీచర్లు ఇవే.. కొత్త టాబ్లెట్ పూర్తి వివరాలు

-

Oppo Pad 6 launch: చైనా రోజుకో ఆవిష్కరణతో టెక్ ప్రపంచంలో దూసుకుపోతుంది.అలాగే ఆ దేశానికి చెందిన టెక్ దిగ్గజం OPPO తన కొత్త టాబ్లెట్ Oppo Pad 6ను అధికారికంగా మార్కెట్లోకి విడుదల చేసింది. గతంలో వచ్చిన Oppo Pad 5కు అప్‌గ్రేడ్ వెర్షన్‌గా వచ్చిన ఈ డివైస్, శక్తివంతమైన ప్రాసెసర్, ప్రీమియం డిస్‌ప్లే, భారీ బ్యాటరీతో ఆకట్టుకుంటోంది.

ఈ టాబ్లెట్‌లో 12.1 అంగుళాల LCD డిస్‌ప్లేను అందించారు. 3000 × 2120 పిక్సెల్ రిజల్యూషన్‌తో పాటు 144Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఉంది. 540Hz టచ్ శాంప్లింగ్ రేట్ కారణంగా స్క్రీన్ స్పందన వేగంగా ఉండనుంది. అలాగే 900 నిట్స్ వరకు బ్రైట్‌నెస్, DCI-P3 కలర్ గామట్ సపోర్ట్ కారణంగా వీడియో స్ట్రీమింగ్, గేమింగ్, డ్రాయింగ్ వంటి పనుల్లో మెరుగైన అనుభవాన్ని అందిస్తుందని కంపెనీ పేర్కొంది.

పనితీరు కోసం ఇందులో మీడియాటెక్ కొత్త డైమెన్సిటీ 9500s చిప్‌సెట్‌ను ఉపయోగించారు. దీనికి ఆర్మ్ Mali-G615 MC2 GPU జత చేశారు. గరిష్టంగా 16GB LPDDR5x RAM, 512GB UFS 3.1 స్టోరేజ్ ఆప్షన్‌లతో ఈ టాబ్లెట్ అందుబాటులోకి వచ్చింది. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత ColorOS 16పై పనిచేస్తుంది.

ఫోటోగ్రఫీ కోసం ముందు, వెనుక భాగాల్లో 8MP కెమెరాలను అందించారు. రెండు కెమెరాలతో కూడా 30fps వద్ద 4K వీడియోలను రికార్డ్ చేయొచ్చు. కనెక్టివిటీ పరంగా Wi-Fi 7, Bluetooth 5.4, USB Type-C పోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఒప్పో ప్యాడ్ 6లో 10,420mAh భారీ బ్యాటరీని అందించారు. దీనికి 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. పెద్ద బ్యాటరీ ఉన్నప్పటికీ టాబ్లెట్ కేవలం 5.99mm మందంతో స్లిమ్ డిజైన్‌ను కలిగి ఉంది.

ఈ టాబ్లెట్ పలు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. ప్రారంభ ధర CNY 3,499గా నిర్ణయించగా, భారత కరెన్సీలో ఇది సుమారు రూ.49 వేల వరకు ఉంటుంది. డీప్ స్పేస్ గ్రే, గెలాక్సీ సిల్వర్, స్టార్‌లైట్ బ్లూ కలర్ ఆప్షన్‌లలో కొనుగోలు చేయవచ్చు.

- Advertisment -
Chat on WhatsApp

Must Read

andhra pradesh heavy rain alert yellow warning for coastal districts

Heavy rains | ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజుల పాటు వర్షాలు.. వాతావరణ శాఖ కీలక...

Heavy rains: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి వర్షాలు విస్తరించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వాతావరణంలో ఏర్పడిన తాజా మార్పుల కారణంగా రానున్న రెండు నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే...
- Advertisement -
Chat on WhatsApp