OnePlus N6: కొత్త సిరీస్‌తో వన్‌ప్లస్ భారత మార్కెట్లో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. కంపెనీ తాజాగా కొత్తగా ప్రవేశపెట్టిన OnePlus N సిరీస్‌లో తొలి మోడల్‌గా OnePlus N6ను అధికారికంగా ప్రకటించింది. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను 2026 జూన్ 30న భారతదేశంలో విడుదల చేయనున్నట్లు సంస్థ ధృవీకరించింది. ఎంట్రీ-లెవల్ మరియు బడ్జెట్ సెగ్మెంట్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఈ ఫోన్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న OnePlus Nord CE Lite సిరీస్ కంటే తక్కువ ధరలోనే ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
డిజైన్ విషయానికి వస్తే, OnePlus భారతదేశానికి ప్రత్యేకంగా మైక్రోసైట్‌ను విడుదల చేసింది. అందులోని టీజర్ ద్వారా ఫోన్ డిజైన్ మరియు కలర్ ఆప్షన్లు వెల్లడయ్యాయి. N6 బ్లాక్ మరియు గ్రీన్ రంగుల్లో విడుదల కానుంది. ఫ్లాట్ ఫ్రేమ్, ఫ్లాట్ బ్యాక్ ప్యానెల్‌తో ఆధునిక లుక్‌ను కలిగి ఉండగా, వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ కనిపించనుంది. పవర్ బటన్, వాల్యూమ్ కీలు కుడివైపున అమర్చబడ్డాయి. ఈ ఫోన్ Amazon ద్వారా భారత మార్కెట్లో విక్రయించబడనుందని కంపెనీ ఇప్పటికే స్పష్టం చేసింది.
“Always On. Always Smooth.” అనే ట్యాగ్‌లైన్‌తో విడుదలైన టీజర్ ద్వారా, ఈ ఫోన్ సాఫ్ట్ పనితీరు, మెరుగైన యూజర్ అనుభవం మరియు దీర్ఘకాలిక బ్యాటరీ బ్యాకప్‌పై దృష్టి సారించినట్లు అర్థమవుతోంది. ధర విషయానికి వస్తే, ఇప్పటివరకు అధికారిక సమాచారం వెలువడలేదు. అయితే పలు నివేదికల ప్రకారం OnePlus N6 ధర రూ.20,000 లోపు ఉండే అవకాశం ఉంది.
ప్రస్తుతం OnePlus యొక్క బడ్జెట్ సెగ్మెంట్‌లో ఉన్న Nord CE Lite సిరీస్ కంటే మరింత అందుబాటు ధరలో ఇది వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రాసెసర్, కెమెరా, బ్యాటరీ వంటి పూర్తి స్పెసిఫికేషన్లు త్వరలో వెల్లడించనున్నారు. అయితే ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం, బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో OnePlus N6 గట్టి పోటీ ఇవ్వగల మోడల్‌గా నిలిచే అవకాశముంది.







