Sunday, June 28, 2026
HomeNationalNarendra Modi | సోషల్ మీడియాలో మోడీ క్రేజ్....అత్యధిక ఫాలోవర్లు కలిగిన నేతగా మోడీ

Narendra Modi | సోషల్ మీడియాలో మోడీ క్రేజ్….అత్యధిక ఫాలోవర్లు కలిగిన నేతగా మోడీ

-

Narendra Modi: ప్రధాని నరేంద్ర మోడీకి సామాజిక మాధ్యమాల్లో అపారమైన ఆదరణ లభిస్తోంది. తాజాగా ఇంస్టాగ్రామ్ (Instagram)లో ఆయనను అనుసరించే వారి సంఖ్య 10 కోట్ల మైలురాయిని దాటింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఫాలోవర్లు కలిగిన రాజకీయ నాయకుడిగా మోడీ రికార్డు సృష్టించారు.

2014లో ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుపెట్టిన ఆయన, తన అధికారిక ఖాతా ద్వారా ప్రభుత్వ కార్యక్రమాలు, విదేశీ పర్యటనలు, వ్యక్తిగత క్షణాలను పంచుకుంటూ ప్రజలతో అనుసంధానమవుతున్నారు.

ఇతర నాయకులతో పోలిస్తే మోడీకి ఎక్కువ ఫాలోవర్స్ తో ముందున్నారు.అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు సుమారు 4.3 కోట్ల ఫాలోవర్లు ఉండగా, ఇండోనేసియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో కు 1.5 కోట్లు, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్‌ ఇనాసియో లూలా కు 1.4 కోట్లకు పైగా, తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్‌కు 1.1 కోట్లు, అర్జెంటీనా అధ్యక్షుడు హవియేర్‌ మిలే కు 64 లక్షల ఫాలోవర్లు ఉన్నారు.

ఇక కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul gandhi) ను ఇన్‌స్టాగ్రామ్‌లో 1.2 కోట్లకు పైగా మంది అనుసరిస్తున్నారు. ఈ గణాంకాలు మోదీ డిజిటల్ ప్రభావాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయి.

ALSO READ:Samsung Galaxy S26 Ultra | గెలాక్సీ అన్‌ప్యాక్డ్ 2026లో S26 సిరీస్ ఆవిష్కరణ

- Advertisment -
Chat on WhatsApp

Must Read

18-day-old baby rescued alive from venezuela earthquake rubble

Venezuela | శిథిలాల కింద 48 గంటల పోరాటం.. సజీవంగా బయటపడిన 18 రోజుల...

Venezuela: వెనిజులాలో సంభవించిన భారీ భూకంపం వేలాది కుటుంబాలను విషాదంలో ముంచెత్తింది. క్షణాల్లో కూలిపోయిన భవనాలు, కోల్పోయిన ప్రాణాలు, నిరాశ్రయులైన ప్రజలు దేశాన్ని శోకసంద్రంలోకి నెట్టాయి. అయితే ఈ విషాదంలోనూ కొన్ని ఘటనలు...
- Advertisement -
Chat on WhatsApp