Saturday, June 27, 2026
HomeInterNationalIndia vs new zealand series: గంభీర్ కోచింగ్‌పై ట్రోలింగ్.. తప్పించాలన్న డిమాండ్లు

India vs new zealand series: గంభీర్ కోచింగ్‌పై ట్రోలింగ్.. తప్పించాలన్న డిమాండ్లు

-

 
india vs new zealand series: ఇండోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో టీమ్ ఇండియా 41 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దీంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను భారత్ 1-2 తేడాతో కోల్పోయింది.

తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 337 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలోకి దిగిన భారత్ 46 ఓవర్లలో 296 పరుగులకే కుప్పకూలింది.

ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ(Virat Kohli) శతకం సాధించగా, నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా అర్ధశతకాలు చేశారు. అయినప్పటికీ జట్టుకు విజయం అందలేదు.లోయర్ ఆర్డర్ పెద్దగా ప్రభావం చూపకపోవడంతో ఓటమిని మూటకట్టుకుంది.

ఈ ఓటమితో కోచ్ గౌతమ్ గంభీర్ వ్యూహాలు, ఆటగాళ్ల ఎంపికపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు గంభీర్‌ను కోచ్ పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆటగాడిగా అద్భుతంగా రాణించిన గంభీర్, కోచ్‌గా మాత్రం విఫలమవుతున్నాడన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇక భారత్ తదుపరి వన్డే సిరీస్‌ను ఐదు నెలల తర్వాత ఇంగ్లాండ్‌తో ఆడనుంది. జులై 14న బర్మింగ్‌హామ్‌లో తొలి వన్డే జరగనుంది. ప్రస్తుతం భారత జట్టు దృష్టి ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభమయ్యే టీ20 వరల్డ్ కప్‌పై ఉంది.

అలాగే జనవరి 21 నుంచి న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌ల్లో ఫలితాలు ప్రతికూలంగా వస్తే గంభీర్ భవిష్యత్తు మరింత ప్రమాదంలో పడే అవకాశముందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

- Advertisment -
Chat on WhatsApp

Must Read

andhra pradesh heavy rain alert yellow warning for coastal districts

Heavy rains | ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజుల పాటు వర్షాలు.. వాతావరణ శాఖ కీలక...

Heavy rains: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి వర్షాలు విస్తరించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వాతావరణంలో ఏర్పడిన తాజా మార్పుల కారణంగా రానున్న రెండు నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే...
- Advertisement -
Chat on WhatsApp