Saturday, June 27, 2026
HomeCrime Newsతాడిపర్రులో కరెంట్ షాక్, నలుగురు మృతి

తాడిపర్రులో కరెంట్ షాక్, నలుగురు మృతి

-

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలంలోని తాడిపర్రులో ఫ్లెక్సీ కడుతున్న సమయంలో కరెంట్ షాక్‌ తీసుకుని నలుగురు చనిపోయిన దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. నలుగురు మృతిచెందడం చాలా బాధాకరమని, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు.

అలాగే, క్షతగాత్రులను మెరుగైన వైద్యం అందించడానికి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ప్రభుత్వానికి సహాయానికి ముందుకు రాండి అని పేర్కొంటూ బాధిత కుటుంబాలకు ప్రభుత్వం భరోసా ఇచ్చింది. ప్రభుత్వం తరఫున రూ. 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.

ఈ దుర్ఘటన తాడిపర్రులో పాపన్నగౌడ్ విగ్రహావిష్కరణ సందర్భంగా జరిగినది. మృతులను వీర్రాజు, నాగేంద్ర, మణికంఠ, కృష్ణగా గుర్తించారు. పోలీసులు సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

- Advertisment -
Chat on WhatsApp

Must Read

andhra pradesh heavy rain alert yellow warning for coastal districts

Heavy rains | ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజుల పాటు వర్షాలు.. వాతావరణ శాఖ కీలక...

Heavy rains: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి వర్షాలు విస్తరించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వాతావరణంలో ఏర్పడిన తాజా మార్పుల కారణంగా రానున్న రెండు నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే...
- Advertisement -
Chat on WhatsApp