Saturday, June 27, 2026
HomeTelanganaCV Anand | తెలంగాణ డీజీపీగా బాధ్యతలు చేపట్టిన సీవీ ఆనంద్

CV Anand | తెలంగాణ డీజీపీగా బాధ్యతలు చేపట్టిన సీవీ ఆనంద్

-

CV Anand: తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు. డీజీపీ కార్యాలయానికి చేరుకున్న ఆయనకు ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, నిర్ణీత సమయానికి అధికారికంగా బాధ్యతలు చేపట్టారు.

1991 బ్యాచ్‌కు చెందిన సీవీ ఆనంద్ అనుభవజ్ఞుడైన అధికారిగా గుర్తింపు పొందారు. కెరీర్ ప్రారంభంలో ఉమ్మడి వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో ఏఎస్పీ, ఎస్పీగా పనిచేసి, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో శాంతిభద్రతలను సమర్థంగా నిర్వహించారు. తరువాత హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా, ట్రాఫిక్ కమిషనర్‌గా, హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు.

పోలీసు శాఖలో సాంకేతికతను ప్రవేశపెట్టి వినూత్న మార్పులు తీసుకురావడంలో ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు. ట్రాఫిక్ నిర్వహణలో ఈ-చలాన్ విధానం, స్పీడ్ గన్స్ వినియోగం, రివర్సిబుల్ లేన్లు, ఫ్రీ లెఫ్ట్ వంటి మార్పులతో నగర ట్రాఫిక్ సమస్యలను తగ్గించే ప్రయత్నం చేశారు. పారదర్శకత, సమర్థత పెంపుపై ఆయన చేసిన చర్యలు ఆదర్శంగా నిలిచాయి.

ఇప్పుడు పూర్తి స్థాయి డీజీపీగా బాధ్యతలు చేపట్టిన సీవీ ఆనంద్ రాష్ట్రవ్యాప్తంగా పోలీసింగ్‌లో కొత్త విధానాలు తీసుకువస్తారనే ఆశలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల భద్రత, నేర నియంత్రణ, టెక్నాలజీ ఆధారిత సేవలపై ఆయన దృష్టి ఎలా ఉండబోతుందో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

- Advertisment -
Chat on WhatsApp

Must Read

andhra pradesh heavy rain alert yellow warning for coastal districts

Heavy rains | ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజుల పాటు వర్షాలు.. వాతావరణ శాఖ కీలక...

Heavy rains: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి వర్షాలు విస్తరించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వాతావరణంలో ఏర్పడిన తాజా మార్పుల కారణంగా రానున్న రెండు నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే...
- Advertisement -
Chat on WhatsApp