CRPF Recruitment: కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) 2026 సంవత్సరానికి సంబంధించి భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 9,175 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. టెక్నికల్, ట్రేడ్స్‌మెన్, పయనీర్ విభాగాల్లో నియామకాలు జరుగుతాయి. 10వ తరగతి లేదా ఐటీఐ(ITI) అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్‌కు సుమారు 504 పోస్టులు, తెలంగాణకు 353 పోస్టులు కేటాయించారు. మహిళల కోసం కూడా ప్రత్యేకంగా 79 పోస్టులు ఉన్నాయి. ఎంపికైన వారికి లెవెల్-3 ప్రకారం ప్రారంభ మూల వేతనం రూ.21,700 ఉండగా, అలవెన్సులతో కలిపి నెలకు సుమారు రూ.40,000 వరకు వేతనం పొందే అవకాశం ఉంది.
నియామక ప్రక్రియలో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (PET), ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ (PST), కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ పరీక్షలు ఉంటాయి. పురుషులు 5 కిమీ పరుగును 24 నిమిషాల్లో పూర్తి చేయాలి. మహిళలు 1.6 కిమీ పరుగు నిర్ణీత సమయంలో పూర్తి చేయాలి. రాత పరీక్ష 100 ప్రశ్నలు, 100 మార్కులతో 2 గంటల పాటు ఆన్‌లైన్‌లో జరుగుతుంది.
వయోపరిమితి 18 నుంచి 23 సంవత్సరాలు కాగా డ్రైవర్ పోస్టులకు 21 నుంచి 27 సంవత్సరాలు. చివరి తేదీ మే 19. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు వెబ్‌సైట్: http://www.rect.crpf.gov.in/







