Saturday, June 27, 2026
HomeOthersవివాదాస్పద అఘోరి–వర్షిణి పెళ్లి వీడియో వైరల్

వివాదాస్పద అఘోరి–వర్షిణి పెళ్లి వీడియో వైరల్

-

తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన అఘోరి వ్యవహారానికి సంబంధించి మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. వివాదాస్పదంగా మారిన ఆ అఘోరి, అతడి వెంట తిరుగుతున్న ఏపీ యువతి వర్షిణిని పెళ్లి చేసుకున్నాడు. మధ్యప్రదేశ్‌లోని ఓ మారుమూల గ్రామంలోని ఆలయంలో జరిగిన ఈ వివాహానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వీడియోలో వర్షిణి మెడలో తాళి కడుతున్న అఘోరి, వారు తలంబ్రాలు పోసుకుంటున్న దృశ్యాలు ఉన్నాయి. అంతేకాకుండా, ఇద్దరూ దండలు మార్చుకుని ఏడడుగులు నడిచిన దృశ్యాలు కూడా స్పష్టంగా కనిపించాయి. ఈ పరిణామంతో ఆ మధ్య వార్తల్లో నిలిచిన ఈ జంట మళ్లీ నెట్టింట్లో హాట్ టాపిక్ అయ్యారు.

వర్షిణి–అఘోరి మధ్య పరిచయం నందిగామలో ప్రారంభమైంది. అప్పట్లో వివస్త్రంగా ఉన్న అఘోరికి వర్షిణి సాయం చేయగా, ఆమె కుటుంబ సభ్యులు ఆ అఘోరిని తమ ఇంటికి ఆహ్వానించారు. అఘోరి అక్కడ కొన్నిరోజులు గడిపిన తర్వాత వర్షిణిని వెంట తీసుకెళ్లాడు. గుజరాత్‌లో గడిపిన తర్వాత వర్షిణి కుటుంబ సభ్యులు ఆమెను వెనక్కి తీసుకువచ్చారు.

అయితే కొంతకాలం తర్వాత వర్షిణి మళ్లీ ఇంటి నుంచి పారిపోయి అఘోరిని కలిసింది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి మధ్యప్రదేశ్‌కు వెళ్లారు. తాజాగా అక్కడే ఆలయంలో ఈ వివాహం జరిగినట్టు తెలుస్తోంది. ఈ పరిణామంపై వర్షిణి కుటుంబ సభ్యులు ఎలాంటి స్పందన ఇవ్వలేదని సమాచారం.

- Advertisment -
Chat on WhatsApp

Must Read

andhra pradesh heavy rain alert yellow warning for coastal districts

Heavy rains | ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజుల పాటు వర్షాలు.. వాతావరణ శాఖ కీలక...

Heavy rains: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి వర్షాలు విస్తరించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వాతావరణంలో ఏర్పడిన తాజా మార్పుల కారణంగా రానున్న రెండు నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే...
- Advertisement -
Chat on WhatsApp