Saturday, June 27, 2026
HomeNationalBudget 2026 | MGNREGA కంటే జీ రామ్ జీ స్కీమ్‌కే భారీ నిధులు

Budget 2026 | MGNREGA కంటే జీ రామ్ జీ స్కీమ్‌కే భారీ నిధులు

-

Budget 2026: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ 2026-27లో ఉపాధి హామీ పథకాల విషయంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. మహాత్మ గాంధీ ఉపాధి హామీ పథకం (MGNREGA) స్థానంలో తీసుకొచ్చిన “వికాసిత్ భారత్(Viksit Bharat) – జీ రామ్ జీ స్కీమ్”(Ji Ram Ji Scheme)కు కేంద్రం భారీగా నిధులు కేటాయించింది.

ఈ కొత్త పథకం కోసం “రూ.95,692 కోట్లు” కేటాయించగా, గతేడాది MGNREGAకు “రూ.86 వేల కోట్లు” మాత్రమే కేటాయించారు.

MGNREGAను పూర్తిగా నిలిపివేయకుండా, పాత బకాయిలు చెల్లించేందుకు మరియు కొత్త స్కీమ్ పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చే వరకు కొనసాగించేందుకు “రూ.30,000 కోట్లు” మాత్రమే కేటాయించారు. అంటే సుమారు ఆరు నెలల పాటు మాత్రమే MGNREGA అమలులో ఉంటుంది.

కొత్త జీ రామ్ జీ స్కీమ్ కింద ఉపాధి హామీ రోజులను “100 నుంచి 125 రోజులకు” పెంచారు. బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి చేయగా, వేతనాలు నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతాయి. నిధుల పంపిణీలో కీలక మార్పు తీసుకొచ్చి “కేంద్రం 60%, రాష్ట్రాలు 40%” భరించాల్సి ఉంటుంది. అయితే ఈశాన్య, హిమాలయ రాష్ట్రాలకు “90:10″. కేంద్ర పాలిత ప్రాంతాలకు”100% నిధులు కేంద్రం” భరిస్తుంది.

ఈ పథకం కింద పనులను నాలుగు విభాగాలుగా విభజించారు—జల భద్రత, గ్రామీణ మౌలిక సదుపాయాలు, జీవనోపాధి కల్పన, విపత్తు నిర్వహణ. అయితే రాష్ట్రాలపై ఆర్థిక భారం పెరుగుతుందనే అంశంపై రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చ కొనసాగుతోంది.

also read:Smartphones | మొబైల్ కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్‌.. ధరలు తగ్గే ఛాన్స్‌

- Advertisment -
Chat on WhatsApp

Must Read

andhra pradesh heavy rain alert yellow warning for coastal districts

Heavy rains | ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజుల పాటు వర్షాలు.. వాతావరణ శాఖ కీలక...

Heavy rains: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి వర్షాలు విస్తరించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వాతావరణంలో ఏర్పడిన తాజా మార్పుల కారణంగా రానున్న రెండు నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే...
- Advertisement -
Chat on WhatsApp