Saturday, June 27, 2026
HomeTelanganaTelangana Government Jobs | తెలంగాణలో ఉద్యోగాల కోసం వయో సడలింపు.. 10 ఏళ్లు పెంచిన...

Telangana Government Jobs | తెలంగాణలో ఉద్యోగాల కోసం వయో సడలింపు.. 10 ఏళ్లు పెంచిన ప్రభుత్వం

-

Telangana Government Jobs: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం కీలక శుభవార్త ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగ నియామకాలలో గరిష్ఠ వయోపరిమితిని మరో పదేళ్లు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు విడుదల చేశారు. ఇప్పటివరకు సాధారణ ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితి 34 ఏళ్లుగా ఉండగా, తాజా నిర్ణయంతో దాన్ని 44 ఏళ్లకు పెంచారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తర్వాత ఉద్యోగ నియామకాల ప్రక్రియలో ఆలస్యం జరగడం, కరోనా కారణంగా పరీక్షలు, నోటిఫికేషన్లు వాయిదా పడటం వల్ల అనేక మంది అభ్యర్థులు వయోపరిమితి దాటిపోయారు. దీంతో ప్రభుత్వం ప్రత్యేక సడలింపు ఇవ్వాలని నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వయోపరిమితిపై పదేళ్ల సడలింపుని అమలు చేయాలని నిర్ణయించింది.

రాష్ట్రంలోని వివిధ నియామక సంస్థలు విడుదల చేసే సాధారణ ప్రభుత్వ ఉద్యోగాలన్నింటికీ ఈ నూతన నిబంధన వర్తించనుంది. అయితే యూనిఫాం సర్వీసులకు ఈ సడలింపు వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

పోలీస్, అగ్నిమాపక, మద్యం నియంత్రణ, జైలు, అటవీ శాఖల వంటి శారీరక దారుఢ్య పరీక్షలు అవసరమైన ఉద్యోగాలకు ప్రస్తుతం అమల్లో ఉన్న పాత వయోపరిమితి నిబంధనలే కొనసాగనున్నాయి. ఈ నిర్ణయం వల్ల వేలాది మంది నిరుద్యోగ యువతకు ప్రభుత్వ ఉద్యోగాల కోసం మరో అవకాశం లభించనుంది.

ALSO READ: Heatwave Warning | తెలుగు రాష్ట్రాలకు భారీ హీట్‌వేవ్…జిల్లాలకు రెడ్ అలర్ట్, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి


- Advertisment -
Chat on WhatsApp

Must Read

andhra pradesh heavy rain alert yellow warning for coastal districts

Heavy rains | ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజుల పాటు వర్షాలు.. వాతావరణ శాఖ కీలక...

Heavy rains: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి వర్షాలు విస్తరించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వాతావరణంలో ఏర్పడిన తాజా మార్పుల కారణంగా రానున్న రెండు నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే...
- Advertisement -
Chat on WhatsApp